مسلمانوں میں رسم و رواج

ترمیم

سانچہ:ఇస్లామీయ సంస్కృతి

 
ఇస్రాయీలు లోని ఒక యువ బెదుయీన్ ఉత్తర ఆఫ్రికా నమూనాలో ఫెజ్ ధరించాడు.

ముస్లింల ఆచారాలు. ముస్లిం అనగా ఇస్లాం ను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు. ఇస్లాం సూచనలకు మూలాధారాలు: ఖురాన్, సున్నహ్, హదీసులు మరియు షరియా.

ముఖ్య గమనిక: ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు.

 
మీలాద్-ఉన్-నబి సందర్భంగా సమావేశం.

ఆచారాలకూ చేష్ఠలకూ మూఢవిశ్వాసాలకూ తేడాలు:

ఆచారం: ముస్లింలు పరస్పరం 'సలాము' చేసుకోవడం ఆచారం. ఈ ఆచారం ఎంతో పరిశుధ్ధమైనది. దీని ఉదాహరణ ముస్లిమేతరులుకూడా ఇస్తారు.
చేష్టలు: ఉదాహరణకు అరేబియాలో కొందరు అరబ్బులు ఒంటెల పందెం లో, ఒంటెలను ఉత్సాహపరచేందుకో లేక బెదిరించి పరుగులంకించుకొనేం దుకో, ఒంటెలకు పసిపిల్లలను కట్టేశారట. పసిబిడ్డలు చేసే అర్తనాదాలకు ఆ ఒంటెలు బెదిరి పరుగులంకించేవట. ఈ మధ్య ఈ వార్త ప్రపంచమంతా గుప్పుమంది. ఆ అరబ్బులు ముస్లింలు, వారు చేసిన చేష్టలు ఇస్లాం బోధించినవికావు.
మూఢ విశ్వాసం: కొందరు మౌల్వీలు, జిన్ లు తమ వశంలో ఉన్నాయని, వాటి ద్వారా ఏలాంటి కార్యాలైనా సిధ్ధింపజేస్తామని పామరులకు నమ్మబలికి వారివద్దనుండి డబ్బులు రాబట్టడం తరచూ చూస్తూంటాము. ముస్లింలై ఉండీ అల్లాహ్ పై బలమైన విశ్వాసంలేని వారు, ఇలాంటి మూఢనమ్మకాల షికారు అవుతారు. షికారుచేయువాడు ధార్మికవిషయాలు తెలిసినవాడేనని మరువకూడదు. కానీ ఇతనికి తెలిసింది అసత్యమనేది సత్యం.

ఈ చేష్టలు మరియు మూఢవిశ్వాసాలనుండి ప్రజలను బయటపడవేయడానికే ఇస్లాం అవతరించింది. ఇస్లాం సదాచారాలకు పుట్టినిల్లు. ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు. అందరూ అంగీకరించే ముస్లిం ఆచారాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

نکاح

ترمیم
 
ఓ ముస్లిం వధువు 'నికాహ్ నామా లో సంతకం చేస్తూ.

ఇస్లాం నికాహ్ లేదా వివాహాన్ని ధర్మబద్ధం చేసి ప్రోత్సహించింది. నికాహ్ చేసుకోవడం దైవప్రవక్త సత్సంప్రదాయం. సున్నత్ బ్రహ్మచర్యాన్నీ, వైరాగ్యాన్నీ ఇస్లాం వ్యతిరేకించింది. వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలో ఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్ధీకరిస్తుంది. వ్యభిచారం లేదా హరామ్ నిషిద్ధం. వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక జాడ్యమేమనగా నికాహ్ రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు. ఇందులో అయ్యే ఖర్చు వర్ణనాతీతం. దుబారా ఎక్కువ. భారతదేశంలో ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ. ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలామంది మౌల్వీలు, మౌలానాలు మరియు ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ: షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు. వీళ్లెవరూ నూర్ బాషా, దూదేకుల సాయిబుల్ని పెళ్ళిచేసుకోరు సరిగదా లదాఫ్, పింజారీ అనే పేరులతో అవమానిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసం సమయం వచ్చిందంటే, అల్లాహ్ ముందు అందరూ సమానమే అని ఘోషిస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి స్వర్గప్రాప్తి ని కలిగిస్తుందా? ఆచరించేది మనమే అయినపుడు దాని నింద నిష్టూరాలు ఇతరుల మీద మోపడం అల్లాహ్ దృష్టిలో శిక్షార్హం.

نام رکھائی

ترمیم

సాధారణంగా పిల్లలు పుట్టినపుడు మొదటి నెలలోనే నామకరణం చేస్తారు. ధార్మిక పురుషుల పేర్లు, ప్రకృతికి సంబంధించిన పేర్లు, సాహితీ సంబంధమైన పేర్లు పెడుతుంటారు. ఉదాహరణకు;

  • ధార్మిక పరమైనవి : మగపిల్లలకైతే, అల్లాహ్ యొక్క విశేష నామాలైన రహీం, కరీం, రహ్మాన్, సత్తార్, గఫ్ఫార్, ఖయ్యూం, వగైరాలు. ప్రవక్తల పేర్లు, సహాబాలు లేదా ఆలియాల పేర్లు పెడుతారు. ఉదా: ఆదం, ఇద్రీస్, ఇబ్రాహీం, మూసా, ముహమ్మద్, అహ్మద్, అలీ, హసన్, హుసైన్, మొహియుద్దీన్, మొదలగునవి. ఆడపిల్లలకైతే, మరియం, హాజిరా, సారా, అమీనా, హలీమా, ఫాతిమా, జహ్రా, ఆయేషా, సకీనా, జులైఖా మొదలగునవి.

سلام کرنا

ترمیم

ముస్లింలు తోటి ముస్లింలను పలుకరించే పద్దతి ఇది. "అస్సలాము అలైకుమ్" దీని అర్థం నీపై శాంతి కలుగుగాక. దీనికి ప్రత్యుత్తరంగా వాలేకుమ్ అస్సలాం అని బదులిస్తారు. అస్సలాము అలైకుమ్ అనునది అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అనే పలకరింపునకు సంక్షిప్త రూపము.

مرد داڑھی رکھنا

ترمیم
 
ఉస్మానియా సామ్రాజ్యపు సుల్తాన్ సలీమ్ III.

ఇస్లాంలో పురుషులు గడ్డాన్ని పెంచడం తప్పనిసరి కాదు. ఇది సున్నత్ (ఐఛ్ఛికము) మాత్రమే. మీసాలు తీసివేసి కేవలం గడ్డాన్ని పెంచడాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. దీనిని చెహరా అని అంటారు.

مرد ٹوپی پہننا

ترمیم

ముహమ్మద్ ప్రవక్త ఎల్లప్పుడూ తలను పగడీ లేదా టోపీతో కప్పి ఉంచేవాడు. దీనిని అనుసరిస్తూ ముస్లింలలో పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకు మరియు గౌరవానికి ప్రతీకలు. ఇవి పలు రకాలు: టోపీ, ఫెజ్ వగైరా. కాని ఇది తప్పనిసరి కాదు. టోపీ లేకుండానే నమాజ్ చదివే ముస్లింలు మనకు అక్కడక్కడా గోచరిస్తారు.

عید مبارک

ترمیم

పండుగల సందర్భంగా ఈద్ ముబారక్ తెలుపుతారు. "ఈద్ ముబారక్" అనగా "ఈద్ శుభాకాంక్షలు" లేదా "పండుగ శుభాకాంక్షలు". ప్రధాన పండుగలైన ఈదుల్ ఫిత్ర్ (రంజాన్ పండుగ), మరియు ఈదుల్ అజ్ హా (బక్రీదు పండుగ) సందర్భంగా ఈద్ ముబారక్ అని సంబోధిస్తారు. అలాగే మీలాదున్ నబి (ముహమ్మద్ ప్రవక్త జన్మ దినం) సందర్భంగా "మీలాదున్నబి ముబారక్" అని సంబోధిస్తారు. పుట్టిన రోజు సందర్భంగా "యౌమ్ ఎ పైదాయిష్ ముబారక్" అనీ. అలాగే ఇతర మతస్తుల పండుగల సందర్భంగా "దీపావళి ముబారక్" అనీ, "క్రిస్మస్ ముబారక్" అనీ సంబోదిస్తారు.

خواتین حجاب پہننا

ترمیم
 
హిజాబ్ కు నాలుగు ఉదాహరణలు. గడియారపు ముల్లు విధంగా పైఎడమ నుండి, టర్కీ; దుబాయి యు.ఏ.ఇ.; టెహరాన్ ఇరాన్; మరియు జైపూర్, రాజస్థాన్, భారతదేశం.

హిజాబ్ లేదా పరదా(అరబ్బీ : حجاب )

ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా గౌరవంతో కూడిన హుందాతనం, వ్యక్తిగతం, మరియు సద్-నీతి.[1] ఈ పదము ఖురాన్ లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడినది. దీనినే ఉర్దూ లో పరదా లేదా నఖాబ్, అరబ్బీ లో 'ఖిమార్' خمار అంటారు.

ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. బురఖా భారతీయ, ఆఫ్ఘానీ, ఇరాకీ మరియు ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడ ఉన్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.

قبروں کی زیارت

ترمیم
 
అత్యధిక ముస్లింలు ఔలియాల సమాధుల వద్దకు దుఆ చేయుటకు వెడతారు.

ఇస్లాం లో సమాధులను సందర్శించడం నిషేధం కాదు. సమాధులను సందర్శించే అసలు కారణం మానవులలో 'మరణం' భావన తీసుకు రావడం. లేదనగా మానవుడు ఈ లోకంలోనే అనంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో ప్రపంచం వైపు పరుగెత్తి, అధర్మాల పాలవుతాడు. ఏనాటికైనా మనమందరం మరణిస్తామనే ఆలోచన రేకెత్తిస్తే, అతడి జీవితం కుదుటపడి, న్యాయ ధర్మమార్గాన్ని ఆచరించుటకు ప్రయత్నిస్తాడు. మానవులు 'పుట్టుట గిట్టుట కొరకే' అన్న సత్యాన్ని గ్రహించినపుడు, పాప కర్మములనుండి దూరంగా ఉంటూ సత్యమైన జీవితాన్ని గడుపుటకు ఉద్యుక్తుడౌతాడు. అల్లాహ్ ను గ్రహిస్తాడు. ధర్మమార్గానికి వచ్చి తీరుతాడు.

సమాధుల వద్దకు, అనగా ఖబ్రస్తాన్ (ముస్లిం శ్మశాన వాటిక) వద్దకు గాని, ఔలియాల దర్గాల వద్దకు గాని వెళ్ళినపుడు ఏమి ఆచరించవచ్చును? వేటి కొరకు నిషేధాలున్నవి?

ఆచరణీయాలు:

  • సమాధులు ప్రశాంతతకు, ఆత్మపరమైన శాంతికి నిలయాలు. సమాధుల వద్దకు పిల్లలూ, పెద్దలూ, పురుషులూ అందరూ వెళ్ళవచ్చును.
  • సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచవచ్చును.
  • సమాధులలో ఉన్నవారి మగ్ ఫిరత్ కొరకు, అల్లాహ్ తో 'దుఆ' (ప్రార్థన) చేయవచ్చును.
  • సమాధులలో ఉన్నవారి పేరున దాన ధర్మాలు చేయవచ్చును.
  • హదీసుల ప్రకారం సమాధులలో ఉన్నవారికొరకు ఖురాన్ పఠించవచ్చును.

ممنوع:

  • సమాధుల వద్ద సాష్టాంగ ప్రణామాలు చేయరాదు.
  • సమాధులలో వున్న వారితో నోములు (మన్నత్ లు) నోచరాదు.
  • సమాధులలో ఉన్న వారితో ప్రార్థనలు చేయరాదు. కారణం అన్ని ప్రార్థనలు ఆలకించువాడు మరియు తీర్చువాడు అల్లాహ్ ఒక్కడే.
  • సమాధుల చుట్టూ 'తవాఫ్' (ప్రదక్షిణ) లు చేయరాదు.
  • సమాధుల వద్ద ఔలియాలను స్తోత్తం చేస్తూ ఎల్లవేళలా మన్ ఖబత్ లు పాడుకుంటూ ఉండిపోరాదు. ఇలా చేస్తూ పోతే అసలైన ఈశ్వరుడిని (అల్లాహ్) ను మరచిపోతారు.
  • సమాధులే మనకు సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే గృహద్వారాలు అనే వింత పోకడను విడనాడాలి.
  • తల నీలాలు సమర్పించరాదు.
  • సమాధులలో నిద్రించేవారి పేరున, ఔలియాల పేరున తావీజులు, తాయెత్తులు ధరించరాదు. కారణం ఔలియాలు ఇవన్నీ నేర్పించలేదు. ఇలాంటి మూఢ మరియు అంధవిశ్వాసాలను దూరం చేయడానికే 'ఔలియాలు' పనిచేశారు. తిరిగి 'ఔలియా'ల పేరుతో ఈ మూఢవిశ్వాసాలను నెలకొల్పి, ఔలియాలకు చెడ్డపేరు తేకూడదు.

رواجوں کی بنیاد پر مسلمانوں میں موجودہ حالات

ترمیم

ముస్లింలు విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించరు. కాని దక్షిణ ఆసియా మరియు పర్షియన్ మరియు షియా మతం యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో క్రింది విషయాలు గోచరిస్తాయి. భారతదేశంలోని ముస్లిం సమాజాలలో వీటి ప్రవేశం ఎలా జరిగిందంటే, నవాబులు దాదాపు షియా మతానికి చెందినవారు. ఉదాహరణకు లక్నో నవాబు, అవధ్ నవాబు, బెంగాలు నవాబు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీ వంశము, ఆసఫ్ జాహీ వంశము, టిప్పూ సుల్తాన్, ఆర్కాడు నవాబు, మదురై నవాబు, వీరందరూ షియాలే. వీరి పరిపాలనా కాలంలో చాలా దర్గాలు, ఆషూర్ ఖానా లు, ముహర్రం పీర్ల పండుగలు, (నేటికినీ లక్నో మరియు హైదరాబాదు నగరాలలో చూడవచ్చును), ఫాతెహా ఖ్వానీలు, కుండోంకే ఫాతెహా (రజబ్ నెలలో ఇమాం జాఫర్-ఎ-సాదిక్ మన్నత్ లేదా నోము), ఘడీ కే ఫాతెహా, చరాగోంకే ఫాతెహా (దీపాల మన్నత్), దర్గాల వద్ద 'షిఫా ఖానా' లు, చెరువులు గుంటలు, కొలనులలో మునగడం లాంటి విషయాలు, వెలిశాయి. ఇలాంటి అంధవిశ్వాసాల నుండి మానవాళిని కాపాడడానికే ఇస్లాం అవతరించింది. కాని, నేటికినీ చాలా మంది ముస్లింలు 'అజ్ఞాన కాలం'లోనే విహరిస్తున్నారనే భావన నేటి లోకం భావిస్తున్నది. పెద్ద పెద్ద ముస్లిం సుల్తానులు ఔలియా ల వద్ద నోములు నోచితే (ఉదాహరణకు అక్బర్ తనకు సంతానం లేదని సలీం చిష్తీ అనే సూఫీ ఔలియా సమాధి వద్ద మన్నత్ (నోము) చేశాడు) సాధారణ జనం అలాంటి చక్రవర్తులను అనుకరించడంలో అతిశయోక్తిలేదు.

  • درگاہ
  • جھنڈے کے پیڑ (جھنڈے کے جھاڑ)
  • پنجے - علم (محرم کے )
  • نشان اولیاء - ولیوں کے نشانات

یہ تمام چیزیں کیا اسلامی تعلیمات ہیں یا نہیں؟ اگر نہیں تو یہ آئے کہاں سے؟ اس تعلق سے دیوبندی اور بریلوی حضرات میں اکثر بحث و تکرار ہوتی چلی آرہی ہے۔ ایک دوسرے کی تنقید کرنے میں جٹے ہیں۔

یہ ضروری ہے کہ مسلم سماج میں اب بدعت اور تقلیدوں کے تعلق سے معلومات فراہم کرنا۔ توہم پرستی، انفرادی ضد اور دیگر مذاہب کے رسم رواج کی نقل کرنا جو آئندہ چل کر شرک و بدعت کی طرف لے جاتے ہیں مسلمانوں کو آگاہ کرنا ہر مکتب فکر کے علما کی ذمہ داری ہے۔

مروں میں ختنہ یا ختان

ترمیم
 
Circumcision being performed in central Asia (probably Turkestan), c. 1865–1872. Restored albumen print.

పురుషులకు సున్తీ చేయించడం ఇస్లాం ఆచారం. కొందరు బిడ్డ పుట్టగానే సున్తీ చేయిస్తే మరికొందరు ఒక వయస్సు వచ్చాక చేయిస్తారు. పూర్వం వీటిని మంగలి వారిచే చేయించేవారు. ప్రస్తుతము వైద్యుల ద్వారా సున్తీ చేయిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో దీనిని సుల్తాం', ఖత్నా, వడుగులు అనే పేర్లతో పిలుస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందువులకు ఉపనయనం ఎలాంటిదో ముస్లింలకు ఖత్నా అలాంటిది.

بچوں کا عقیقہ کرنا

ترمیم

పిల్లలకు ఒక వయస్సు వచ్చిన తర్వాత పుట్టుకతో వచ్చే వెంట్రుకలను తొలగించే ప్రక్రియనే అఖీఖా అంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది హిందూమతస్తులు పాటించే కేశ ఖండన లాంటిది.

بسم اللہ خوانی

ترمیم

పిల్లలకు బడికెళ్ళే వయస్సు లేదా విద్యాభ్యాసన వయస్సు వచ్చినపుడు పిల్లల చేత చదువు అభ్యాస ప్రారంభ పరచే ఒక ఆచారం. పిల్లలకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు వయస్సు వచ్చినపుడు ఈ ఆచారం నిర్వహిస్తారు. దీనినే ఖురాన్ ఖ్వానీ అని కూడా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో బాలుడు లేక బాలిక విద్యాభ్యాసం ఖురాన్ పఠనం తో మొదలుపెడతారు. "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" - 'చదువు, అల్లాహ్ పేరుతో' (అరబ్బీ: ఇక్రా బిస్మి రబ్బుకల్లజి ఖలక్) అనే వాక్యంతో విద్యాభ్యాసం ప్రారంభిస్తారు.

تقاریب اور فاتحہ خوانیاں

ترمیم
  • فاتحہ خوانی
  • چہلم
  • چھلہ
  • چھٹی
  • کنڈوں کے فاتحہ
  • گیارویں کے فاتحہ
  • بارھویں کے فاتحہ
  • آخری چہارشنبہ
  • تیرہ تیزی
  • بارہ وفات
  • زیارت
  • برسی
  • عرس
  • صندل

نگار خانہ

ترمیم

مزید دیکھیے

ترمیم


مسلمانوں میں مروجہ تقاریب

ترمیم

سانچہ:ఇస్లామీయ సంస్కృతి ముస్లింల సాంప్రదాయాలు : ముస్లింల సాంప్రదాయాలు అనగానే అరబ్బుల, తురుష్కుల, మొఘలుల సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. ముస్లింల సాంప్రదాయాలు అనే అంశమే చర్చనీయాంశంగా అనిపిస్తుంది. ఇస్లాం మతం 7వ శతాబ్దం అరేబియాలో స్థాపింపబడిన మతము. ఇస్లాం అనునది ఆధ్యాత్మిక ధార్మిక జీవనవిధానం. ప్రారంభదశలో అరబ్బుల సాంప్రదాయాలే ముస్లిం సాంప్రదాయాలనే భ్రమ వుండేది. కానీ ఇస్లాం అనునది కేవలం అధ్యాత్మిక ధార్మిక జీవనవిధానాలనేకాకుండా విశ్వజనీయత, విశ్వసోదరభావం, వసుదైకకుటుంబం, మానవకళ్యాణం, సామాజికన్యాయం, సర్వమానవసౌభ్రాతృత్వం మొదలగు విశ్వౌదారగుణాలనుగల్గిన సంపూర్ణ జీవనవిధానమని మరువగూడదు.

ఇస్లాం అరేబియానుండి, టర్కీ, పర్షియా, మంగోలియా, భారతదేశం, ఉత్తర తూర్పు ఆఫ్రికా, ఇండోనేషియా, జావా (ప్రాంతం), మలయా, సుమిత్రా మరియు బోర్నియో ప్రాంతాలలో శరవేగంగా విస్తరించింది.

ముస్లిం సాంప్రద్రాయం అనే పదం సాధారణంగా ఒక మతరహితమైన ఒక సామాజిక సంస్కృతిగా చారిత్రక ఇస్లామీయ సభ్యతగా పరిగణించేవారు. ముస్లింలు ప్రపంచంలోని పలు దేశాలలో విస్తరించారు. పర్షియన్లుగా, తురుష్కులుగా, భారతీయులుగా, మలయీలు (మలేషియన్లు) గా, బెర్బర్లు (ఇండోనేషియన్లు) గా స్థిరపడి ముస్లింల సాంప్రదాయాన్ని ప్రాపంచీకరించారు.

ముస్లింల సాంప్రదాయంపై అభిప్రాయభేదాలు

ترمیم

ముస్లింల సాంప్రదాయమనే పదము వివాస్పదమైనదనే అభిప్రాయంగలదు. ముస్లింలు ఎన్నోదేశాలలో నివసిస్తున్నారు. ఆయా దేశాల సభ్యతాసంస్కృతులలో విలీనమై గూడా మతపరమైన కొన్ని సాంప్రదాయాలను సజీవంగావుంచారు.

مذہبی رسومات

ترمیم

ముస్లింల సాంప్రదాయాలు సాధారణంగా ఇస్లామీయధర్మాచారాలచుట్టూనే వుంటాయి. ఇవి సంస్కృతికంటే ఎక్కువగా ధార్మికతను గల్గివుంటాయి. ఒకముస్లిం తనజీవితాన్ని ఎక్కువగా ధార్మికతవైపునేవుంచి జీవిస్తాడు.

భాష మరియు సాహిత్యము

ترمیم

అరబ్బీ

ترمیم

ప్రారంభదశలో ఇస్లామీయ భాషాసాహిత్యాలు మహమ్మద్ ప్రవక్త యొక్క మక్కా , మదీనా లలోగల తెగల మాతృభాషయయిన అరబ్బీ భాష వుండేవి. తదనుగుణంగానే ధార్మిక సాహిత్యాలుగా ఖురాన్, హదీసులు, సీరత్ (సీరా) మరియు ఫిఖహ్, అరబ్బీ భాషలోనే వుండేవి. ఉమయ్యద్ ఖలీఫాల కాలంలో మతరహిత సాహిత్యాలు ఊపిరిపోసుకొన్నవి. వెయిన్నొక్క రాత్రులు అలీఫ్ లైలా కథలు ఈ కోవకు చెందినవే.

పర్షియన్

ترمیم

అబ్బాసీయ ఖలీఫాల పరిపాలనా కాలంలో పర్షియన్ (పారశీ, పారశీకం) భాష ముస్లిం సంస్కృతియొక్క ప్రధానమైన భాషగా విరాజిల్లింది, పర్షియన్ సాహిత్యం ఎంతోప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. రూమి (మౌలానా రూమ్) యొక్క ప్రఖ్యాత కవితాకోశం 'విహంగాల సభ' ఎంతో ప్రఖ్యాతిగాంచింది.

దక్షిణ ఆసియా

ترمیم

దక్షిణాసియాలో ప్రముఖంగా పారశీకం ఉర్దూ, హిందీ, బెంగాలీ మరియు ఇతర భారతీయ భాషలలో ఇస్లామీయ సాహిత్యాలు అభివృద్ధి చెందినవి. సూఫీ సాహిత్యాలు ప్రముఖ పాత్రను పోషించాయి మరియు పోషిస్తూనేవున్నాయి.

నవీన

ترمیم

عیدین، تقاریب

ترمیم

చూడండి: ఈదుల్ ఫిత్ర్, బక్రీదు, ఆషూరా, మీలాదున్నబి, షబ్-ఎ-మేరాజ్, షబ్-ఎ-బరాత్ మరియు షబ్-ఎ-ఖద్ర్.

فاتحہ

ترمیم

ఫాతిహా అంటే ప్రారంభం అని అర్ధం.ఖురాను లో మొదటి సూరా పేరు.సాయిబులు పెళ్ళిల్లలో దినాలలో భోజనం కార్యక్రమం మొదలు పెట్టే ముందు,కొత్త బట్టలు వస్తువులు వాడే ముందు చేయించేప్రార్ధన ను, కూడా ఫాతిహా అని పిలుచుకుంటారు.

نکاح

ترمیم

పెండ్లి లేక కళ్యాణాన్నే అరబ్బీ లో ఒఖ్ద్ లేదా అన్-నికాహ్ అంటారు. పర్షియన్ మరియు ఉర్దూ లో షాది లేక ఖానా-ఆబాది అంటారు. హదీసు లలో అన్-నికాహ్ మిన్-సున్నహ్ లేదా న 'నికాహ్ అనునది ప్రవక్తల సాంప్రదాయం'. మహమ్మదు ప్రవక్త ఇలా అంటారు అన్-నికాహ్ నిస్ఫ్ ఈమాన్ అనగా 'నికాహ్ వలన సగం విశ్వాసము సంపూర్ణమగును'. వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థకు పునాదియని, సామాజిక వ్యవస్థకు అల్లిక వంటిదని, వివాహ ప్రాముఖ్యాన్ని వర్ణించారు.

ఇస్లాం లో షరియా ప్రకారం వివాహం ఒక స్త్రీ మరియు పురుషుడి మధ్య ఒక చట్టపరమైన ఒడంబడిక, సామాజిక కట్టుబాటు. నికాహ్ గురించి ఖురాన్ లో 4:4 మరియు 4:24 లో వర్ణింపబడినది.

فنون

ترمیم

ఇస్లామీయ కళలు, ఇస్లామీయ శాస్త్రాల యొక్క భాగాలు. ఇవి చారిత్రకంగా చూస్తే ముఖ్యంగా ఆధ్యాత్మిక కళారూపాలు. వీటిలో కేవలం జామితీయాలు, పుష్ప మరియు తీగల అలంకరణలు, వ్రాతలు, లిపుల చిత్రీకరణలు కనిపిస్తాయి. మానవ, జంతువుల కళా రూపాలు అసలే కనిపించవు. దీనికి అతిముఖ్య కారణం ఈశ్వరుడు (అల్లాహ్) చిత్రకళలను, శిల్పకళలనూ, విగ్రహకళారూపాలనూ నిషేధించాడు.

ఇస్లామీయ కళలన్నీ అల్లాహ్ చుట్టూనే వుంటాయి. అల్లాహ్ నిరంకారుడని (ఆకారము లేని వాడని) మరువకూడదు.

ప్రకృతి రమణీయతను చిత్రాలలో ఉపయోగించవచ్చును.

మానవ కళారూపాల నిషేధన వున్నందున, ఖురాన్ వాక్యాలను సుందరమైన అరబ్బీ లిపిలో కళాకృతంచేయడం ప్రారంభమయినది. ఇది ఒక ఆచారంగా కూడా నెలకొల్పబడింది. ఈవిధంగా అరబ్బీ లిపి ప్రాచుర్యం పొందింది. ఖురాను వాక్యాలు, సామెతలు, హితోక్తులు ప్రచారమవుచున్నవి.

عسکری فنون

ترمیم

فن تعمیر

ترمیم

اسلامی فن تعمیر

ترمیم

ఇస్లామీయ (ఇస్లామిక్) వాస్తుకళలు వాటిమూలాలు మహమ్మద్ నిర్మించిన మదీనా లోని మస్జిద్ మస్జిద్-ఎ-నబవి ను అనుసరించి నిర్మాణమైనవి. మరియు ఇస్లాం కు పూర్వమైన చర్చీలు, సినగాగ్ ల నమూనాలనుగూడా స్వీకరించారు.

  • విశాలమైన ముంగిటలు ప్రధానమైన ప్రార్థనాహాలుకు ముఖదశలో నిర్మించేవారు. ఈనమూనా మస్జిద్-ఎ-నబవి నిర్మాణానుసారం స్వీకరించారు.
  • మీనార్లు లేక స్థంభాలు ప్రధానంగా దీపస్థంభాలు. వీటినమూనా దమిష్క్ (డెమాస్కస్) లోని ప్రధాన మసీదును అనుసరించి నిర్మించడం ప్రారంభించారు. 'నూర్' అనగా కాంతి లేక తేజస్సు.
  • మిహ్రాబ్ ప్రార్థనాహాలులో కాబా లేక ఖిబ్లా దిక్కునకు ఒక గర్భం నిర్మిస్తారు.
  • గుంబద్ (గుంబజ్) లేక 'డూమ్'లు (ప్రథమంగా మస్జిదె నవవితో ఈ సాంప్రదాయం మొదలయినది).
  • ఇవాన్ లు
  • వాస్తుకళలు అరబిక్ వాస్తుకళలలో పుష్పాలు, పుష్పతీగలు ప్రముఖంగా కనబడుతాయి.
  • ఇస్లామీయ అలంకృతులు, అరబ్బీలిపి.ఇస్లామీయ లిపీ కళాకృతులు.
  • భవననిర్మాణాలు.
  • వజూ కొరకు నీటికొలనులు.
  • గాఢమైన రంగుల ఉపయోగం.
  • భవనాల అంతర్నిర్మాణాలపట్ల బాహ్యనిర్మాణాలకన్నా ప్రత్యేకశ్రద్ధను గల్గివుండడం.

موسیقی

ترمیم

ఇస్లాంలో సంగీతం నిషేధం. అయిననూ పెక్కు చోట్ల మతపరమైన కవిత్వాలకు, అనుమతింపబడిన సంగీతవాయిద్యాల (దఫ్) ఉపయోగాలకు అనుగుణంగా సాంప్రదాయీకరించిన సంగీతాన్ని నిర్దిష్టీకరించారు. ఇస్లామీయ శాస్త్రీయ సంగీత కేంద్రాలైన అరేబియా, మధ్యప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా, ఈజిప్టు, ఇరాన్, మధ్యాసియా, ఉత్తర భారతదేశం మరియు పాకిస్తాన్ లందు ఆధ్యాత్మిక కవితలూ, గీతాలూ ప్రాశస్తం పొందినవి.

సెల్జుగ్ తురుష్కులు, ఒక సంచారజాతి ఇస్లాంను స్వీకరించిన తరువాత అనటోలియా ప్రస్తుతం టర్కీ ను ఆక్రమించి తరువాత ఖలీఫా పదవిని అధిష్టించి ఉస్మానియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇస్లామీయ సంగీతంపై వీరి ప్రభావం ఎక్కువ.

మధ్య సహారా ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా మరియు దక్షిణ ఫిలిప్పైన్ లలో కూడా ముస్లింల జనాభా అధికం. కానీ ఈ ప్రాంతాలలో ఇస్లామీయ సంగీత ప్రభావం చాలా తక్కువ.

దక్షిణభారత: మాప్పిళ గీతాలు, దఫ్ ముత్తు

అరబ్బులు ఈ సాంప్రదాయాలను వర్తకం కొరకు ఈ ప్రాంతాలకు వచ్చినపుడు మరియు భారతదేశంలో తమ రాజ్యాలను ఏర్పరచినపుడు నెలకొల్పి అవలంబించారు. ప్రధానంగా సూఫీలు ఈ సాంప్రదాయాలను నెలకొల్పారు. మరియు వీరి సంగీత సాంప్రదాయాలు త్వరగా వ్యాప్తినొందాయి.


دیگر

ترمیم
  1. John Esposito (2003)۔ The Oxford Dictionary of Islam۔ Oxford University Press۔ ISBN 0-19-512558-4, p.112